 
															మత్స్యకారులకు అండగాఉంటాం
జగనన్న మాటగా చెబుతున్నాం.. 
వందలాదిమంది పోలీసులను దించారు.. దారులన్నీ దిగ్బంధం చేశారు.. సంఘీభావం తెలిపే
నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.. రాజయ్యపేట మత్స్యకారులను ఒంటరి వాళ్లను
చేసేందుకు యత్నించారు. వారం రోజులుగా అమలవుతున్న కూటమి నేతల కుటిల నీతిని
తుత్తునియలు చేస్తూ వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. మేమున్నామని భరోసా ఇచ్చింది.
పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశంతో ‘చలో రాజయ్యపేట’కు పిలుపునిచ్చి పార్టీ
అగ్ర నేతలు గ్రామాన్ని సందర్శించారు. చివరి వరకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
నక్కపల్లి: మత్స్యకారులకు మద్దతుగా బుధవారం వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ‘చలో రాజయ్యపేట’ విజయవంతమయింది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తమకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలకు వందలాది మంది మత్స్యకారులు ఘన స్వాగతం పలికారు. రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ గత 39 రోజులుగా మత్స్యకారులు నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. గత నెల 9వ తేదీన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నం వచ్చారు. ఈ సందర్భంగా తాళ్లపాలెం వద్ద మత్స్యకారులు కలసి తమ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ వల్ల కలిగే నష్టాలను, తాము చేస్తున్న ఆందోళనను వివరించారు. తమకు అండగా నిలవాలని కోరారు. జగన్ స్పందిస్తూ మత్స్యకారుల అభిప్రాయాలకు విరుద్ధంగా వారి ఆమోదం లేకుండా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడానికి వీల్లేదన్నారు. మత్స్యకారులు చేపట్టిన ఆందోళనకు వైఎస్సార్‌సీపీ మద్దతు ఉంటుందని, త్వరలోనే పార్టీ జిల్లా నేతలను రాజయ్యపేట పంపిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి సీనియర్ నేతలంతా రాజయ్యపేట తరలివచ్చారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మరో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, పాయకరావుపేట సమన్వయకర్త కంబాల జోగులు ఆధ్వర్యంలో నేతలంతా రాజయ్యపేట వచ్చి మత్స్యకారులకు సంఘీభావం ప్రకటించారు.
రాజయ్యపేట వచ్చిన వారిలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్ జె.సుభద్ర, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కన్నబాబురాజు, చెంగల వెంకటరావు, తైనాల విజయ్‌కుమార్, పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి, సూర్యనారాయణరాజు, సీఈసీ సభ్యులు డాక్టర్ బి.వి.సత్యవతి, రాష్ట్ర కార్యదర్శులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, పైల శ్రీనివాసరావు, మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్‌లు కోలా గురువులు, పేర్ల విజయచందర్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు జాన్ వెస్లీ, ఉత్తరాంధ్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, ముఖ్యనేతలు శరగడం చినఅప్పలనాయుడు, బోదెపు గోవింద్, జియ్యాని శ్రీధర్, అల్లంపల్లి రాజుబాబు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, పార్టీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, మహిళా నేతలు నాగమల్లేశ్వరి, సుందరలత, విశాఖ బోట్ ఆపరేటర్ల సంఘ అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్, వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, తదితరులు ఉన్నారు.
ముందు రెచ్చగొట్టి.. తర్వాత ప్లేటు ఫిరాయించి..
పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. హోంమంత్రి వంగలపూడి అనిత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్, రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ముందు రెచ్చగొట్టారని, అధికారంలోకి వచ్చేక కంపెనీలకు అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. మత్స్యకారులకు ఆమె క్షమాపణ చెప్పాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు విషయమై మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి పెంచడం కోసమే ఇక్కడకు వచ్చామన్నారు. మీ ప్రాణాలు కాపాడుకునేందుకు చేసే పోరాటం ఏ స్థాయికి వెళ్లినా వైఎస్సార్‌సీపీ మీకు అండగా ఉంటుందన్నారు. అవసరమైతే జగన్‌మోహన్‌రెడ్డి మీకు సంఘీభావం ప్రకటించేందుకు రాజయ్యపేట వస్తారన్నారు.
ఆయన ఆదేశాల మేరకు మీ దగ్గరకు వచ్చాం
మీ నిర్ణయమే మాకు శిరోధార్యం
మీ పోరాటానికి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తాం
మత్స్యకారులకువైఎస్సార్‌సీపీ నేతల భరోసా
ప్రజాభీష్టం మేరకే కంపెనీలు ఏర్పాటు చేయాలని స్పష్టీకరణ
చలో రాజయ్యపేట విజయవంతం
భూములు తీసుకునేటప్పడు ఈ కంపెనీ పెడతామని చెప్పలేదు. ఆందోళన సేత్తే కేసులు పెడతన్నారు. నా మీద 15 కేసులు పెట్టారు. మా ఊర్లో 36 మంది మీద కేసులు పెట్టేరు. ఊరు చుట్టూ పోలీసులను పెట్టారు. అందరం ఒకే మాటమీద ఉన్నాం. అవసరమైతే చావడానికై నా సిద్ధం.
–నాగేశు, మత్స్యకారుడు
 
							మత్స్యకారులకు అండగాఉంటాం
 
							మత్స్యకారులకు అండగాఉంటాం
 
							మత్స్యకారులకు అండగాఉంటాం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
