 
															పండగ వేళ విషాదం..
రోడ్డు ప్రమాదంలో స్వీట్స్ దుకాణం యజమాని మృతి 
కోటవురట్ల: పండుగ వేళ ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాలివి. కోటవురట్లకు చెందిన టి.భాస్కరావు(57) ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికంగా మధుర స్వీట్స్ దుకాణం నడుపుతున్న భాస్కరరావు అందరికీ చిరపరిచితుడు. ఆదివారం రాత్రి దుకాణం నుంచి సైకిల్ నడిపించుకుంటూ ఇంటికి వెళుతుండగా సాయినగర్ ఆర్చ్‌కు సమీపంలో నర్సీపట్నం వైపు నుంచి వేగంగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భాస్కరరావు తీవ్రంగా గాయపడగా స్థానికులు హుటాహుటిన స్థానిక సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 10.30 గంటల సమయంలో మృతిచెందారు. దీపావళి రేపు అనగా ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
