 
															అప్రమత్తతే శ్రీరామరక్ష
అనకాపల్లి: దీపావళి.. వెలుగులు విరజిమ్మే ఆనందాల పండగ. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా టపాసులు కాలుస్తూ సంబరాలు జ రుపుకుంటారు. అయితే ఈ సంతోషం విషాదంగా మారకుండా ఉండాలంటే కాస్త అప్రమత్తత అవసరం. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, చిన్నపాటి అజాగ్రత్త వహించినా వెలుగుల పండగ జీవితంలో చీకట్లు నింపే ప్రమాదం ఉంది. టపాకాయలు కాల్చేటప్పుడు బిగుతుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఎల్లప్పుడూ ఇంటి బయటే ట పాసులు వెలిగించాలి. గుడిసెలు, గడ్డివాములు, పెట్రోల్ బంకులకు దూరంగా బాణసంచా వెలిగించాలి.
వీరికి పండగ లేదు
దీపావళి పండగ రోజూ అందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపితే అగ్నిమాపక సిబ్బంది మాత్రం ఎలాంటి ప్రమాదం జరిగినా కాపాడేందు కు సంసిద్ధులై ఉంటారు. జిల్లాలో 6 ఫైర్ స్టేషన్లలో 75 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటితో పాటుగా మరో రెండు అవుట్‌సోర్సింగ్ ఫైర్‌స్టేషన్లలో 25 మంది సిబ్బంది ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
