 
															‘రైవాడ’ నుంచి 4 వేల క్యూసెక్కుల నీరు విడుదల
దేవరాపల్లి: రైవాడ జలాశయం నుంచి మూడు స్పిల్‌వే గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కుల వరద నీటిని శారదా నదిలోకి విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం ప్రాంతంలో అనంతగిరి మండలం పరిధిలో కురిసిన భారీ వర్షాల ధాటికి జలాశయంలోకి ఒక్కసారిగా భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ డీఈ జి.సత్యంనాయుడు స్పిల్‌వే గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా భారీ వర్షాల ధాటికి 3 వేల క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. జలాశయంలోకి వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా నీటి విడుదల పెంపు, తగ్గుదల చేస్తామని డీఈ తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
