తల్లిదండ్రులను గాయపరిచిన తనయుడు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులను గాయపరిచిన తనయుడు అరెస్టు

Oct 19 2025 6:39 AM | Updated on Oct 19 2025 6:39 AM

తల్లిదండ్రులను గాయపరిచిన తనయుడు అరెస్టు

తల్లిదండ్రులను గాయపరిచిన తనయుడు అరెస్టు

● 14 రోజులు రిమాండ్‌

నాతవరం : తల్లిదండ్రులను గాయపరిచిన తనయుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని నాతవరం ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ మండలంలో చెర్లోపాలెం గ్రామానికి చెందిన పెదపూడి రవికుమార్‌ ఈ నెల 13న తల్లిదండ్రులతో పాటు వృద్ధాప్యంలో ఉన్న తాతపై దాడికి పాల్పడినట్టు తెలిపారు. కుటుంబంలో ఆస్తి తగదాలు ఉండడంతో రవికుమార్‌ మద్యం సేవించి వచ్చి కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపరిచాడన్నారు. దీంతో తల్లిదండ్రులు ఇతర కుటుంబీకులు తీవ్ర గాయాలతో నర్సీపట్నంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామంలో బహిరంగ విచారణ చేపట్టామన్నారు. కేసు నమోదు చేిసి కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్‌ విధించడం జరిగిందన్నారు.ఇటీవల కాలంలో మండలంలో తల్లిదండ్రులపై మద్యం సేవించి తగదాలు పడిన కేసులు అధికంగా వస్తున్నామన్నారు. ఈ ఫిర్యాదులపై కేసు నమోదు చేస్తే కచ్చితంగా మూడు నెలలు జైలు శిక్ష పడుతుందని జరిమానా కూడా కోర్డు విధిస్తుందని, ఈ విషయాన్ని గ్రహించాలని ఎస్‌ఐ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement