 
															సృజనాత్మకత, ప్రణాళికతో నాయకత్వ వికాసం
మద్దిలపాలెం: సృజనాత్మకత, పటిష్ట ప్రణాళిక ద్వారానే నాయకత్వ వికాసం సాధ్యమని ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ ఆచార్యులు, ఆర్‌జీయూకేటీ వ్యవస్థాపక వీసీ ఆచార్య ఆర్‌వీ రాజకుమార్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆయన ‘ఒక ఆదర్శ విశ్వవిద్యాలయాన్ని సృష్టించడంలో నాయకత్వ సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. నిబద్ధత, దూరదృష్టితో పనిచేయాలని సూచించారు. ఆర్‌జీయూకేటీల స్థాపన, పరిమిత వనరులతో అభివృద్ధి, ఎదురైన సవాళ్లను ఆయన వివరించారు. తొలి బ్యాచ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో విజయాలు సాధించడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఏయూ పూర్వ విద్యార్థి అయిన ఆచార్య రాజకుమార్‌ను ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ సత్కరించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
