 
															రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌కు ఇద్దరు ఎంపిక
కశింకోట: రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌కు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. స్థానిక డీపీఎన్ జెడ్పీ హైస్కూలులో శుక్రవారం జిల్లా సైన్స్ సెమినార్ నిర్వహించారు. ఇందులో విశేష ప్రతిభ ప్రదర్శించిన మాడుగల మండలం కేజేపురానికి చెందిన మళ్ల గౌతమి ప్రథమ, కశింకోట మండలం తేగాడ మోడల్ స్కూలు విద్యార్థిని జి. లిప్‌షా ద్వితీయ స్థానం పొందారు. వీరికి జ్ఞాపికతోపాటు ప్రతిభా ధ్రువపత్రాలను అందజేశారు. వీరు ఈ నెల 18న విజయవాడలో రాష్ట్ర స్థాయి సెమినార్‌కు హాజరు కానున్నారు. డీఈవో గిడ్డి అప్పారావునాయుడు, ఉప విద్యా శాఖ అధికారి పొన్నాడ అప్పారావు అభినందనలు తెలిపారు. ఇటువంటి సెమినార్లు విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయన్నారు. జిల్లా సైన్స్ అధికారి దాడి కాళిదాసు మాట్లాడుతూ సంప్రదాయ ఫిజిక్స్ నుంచి క్వాంటం ఫిజిక్స్‌కు మారుతున్న తరుణంలో అంతే వేగంతో అభివృద్ధి జరిగి ఫలాలు అందరికి అందగలవన్నారు. సెమినార్‌కు జ్యూరీ సభ్యులుగా ఏఎంఏఎల్ కళాశాల ఉప ప్రిన్సిపాల్ బి. నిరంజన్ కుమార్, డీవీఎన్ కళాశాల అధ్యాపకురాలు ఎన్. భాగ్యలక్ష్మి వ్యవహరించారు. ఎంఈవోలు కేఎస్‌ఎన్ మూర్తి, సురేష్ కుమార్, జిల్లాలో మండలానికి ఇద్దరు వంతున 34 మంది విద్యార్థులు, గైడ్ టీచర్లు హాజరయ్యారు.
 
							రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌కు ఇద్దరు ఎంపిక

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
