 
															ఎస్సీ,ఎస్టీ కేసుపై డీఎస్పీ విచారణ
విచారణ జరుపుతున్న డీఎస్పీ శ్రావణి
రోలుగుంట: మండలం కె.నాయుడు పాలెం గ్రామానికి చెందిన ఇద్దరిపై ఎస్సీఎస్టీ కేసు నమోదైంది. దీనిపై గురువారం డీఎస్పీ ఎం.శ్రావణి స్థానిక ఎస్‌ఐ రామకృష్ణారావుతో కలసి గ్రామంలో విచారణ జరిపారు. ఈ నెల 14 తేదీ రాత్రి ఇదే గ్రామానికి చెందిన రాయిపురెడ్డి ప్రసాద్, గుములూరి రమణబాబులు తనను కులంపేరుతో దూషించి, కర్రతో దాడి చేశారని గ్రామానికి చెందిన ఉడతపల్లి సత్తిబాబు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి సాక్షులను విచారించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేసు దర్యాప్తులో ఉందని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
