
విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి
మాడుగుల రూరల్: డి.గోటివాడ గ్రామంలో విద్యుత్‌షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన తెలియవచ్చింది. గ్రామానికి చెందిన బొబ్బాది శివాజీ (22) గురువారం ఉదయం తన పొలంలో పామాయిల్ కొమ్మలు నరుకుతుండగా, చెట్టు పక్కన్న వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి షాక్ కొట్టడంతో శివాజీ విద్యుత్ షాక్‌కు గురియ్యారు. వెంటనే అతనిని కుటుంబ సభ్యులు మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం తరలిస్తుండగా, మార్గ మధ్యంలోనే మృతిచెందాడు. కాగా ఈ ఘటనపై ఇంతవరకూ ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.