
కలెక్టర్‌కు హస్త కళాకారులసమస్యల ఏకరువు
హస్త కళాకారులతో మాట్లాడుతున్న కలెక్టర్ విజయ కృష్ణన్
యలమంచిలి రూరల్: కలెక్టర్ విజయ కృష్ణన్ ఎదుట ఏటికొప్పాక హస్త కళాకారులు తమ సమస్యలపై ఏకరువు పెట్టారు. 50 ఏళ్లకే సా మాజిక భద్రత పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని, రాయితీ రుణాలు ఇప్పించాలని వారంతా ఆమె ను కోరారు. మంగళవారం ఏటికొప్పాకలో హ స్త కళాకారులతో కలెక్టర్ ముఖాముఖి సమావేశమయ్యారు. లక్కబొమ్మల తయారీ కోసం అ తి ముఖ్యమైన అంకుడు కర్ర తెచ్చుకోవడానికి అటవీ శాఖ ఆంక్షలతో ఎదురవుతున్న ఇబ్బందులు చెప్పుకున్నారు. 16వ నంబరు జాతీయ రహదారి నుంచి ఏటికొప్పాక గ్రామానికి వెడల్పు రహదారి వేస్తే పర్యాటకులు ఎక్కువగా వస్తారన్నారు. పెట్టుబడి లేకపోవడంతో ఆర్థిక వనరుల కోసం స్థానిక వ్యాపారులపై ఆధారపడడం వల్ల తాము ఎదగలేకపోతున్నామన్నారు. ఇక్కడి హస్త కళాకారుల స్థితిగతులపై నివేదిక తయారు చేయాలని పరిశ్రమలు శాఖ జీఎం, యలమంచిలి ఎంపీడీవో, మరికొందరు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ హస్త కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తహసీల్దార్ కె.వరహాలు, కాండ్రకోట చిరంజీవి, అధికారులు పాల్గొన్నారు.