
రేగుపాలెం పీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో తనిఖీ
రేగుపాలెం పీహెచ్‌సీలో రికార్డులు తనిఖీ చేస్తున్న డీఎంహెచ్‌వో హైమావతి
యలమంచిలి రూరల్: మండలంలోని రేగుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్యాధికారి ఎం.హైమావతి మంగళవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఓపీకి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. ఆస్పత్రిలో రికార్డులు, శస్త్ర చికిత్సలు చేసే గది, ఫార్మసీలను పరిశీలించారు. ఆశా వర్కర్లతో జరుగుతున్న సమావేశాన్ని సందర్శించిన ఆమె.. ఆశా వర్కర్ల సేవలు ఎంతో కీలకమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన వివరాలను యాప్‌లో నమోదు చేసే విధానంపై అవగాహన కల్పించాలని ఆస్పత్రి సిబ్బందికి సూచించారు. పీహెచ్‌సీల్లో శస్త్రచికిత్సలు చేయాలని, అప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. ఆస్పత్రి వైద్యురాలు రోహిణీశివ, ఎంపీహెచ్‌ఈవో జమ్ము శ్రీనివాసరావు, ఆస్పత్రి సిబ్బంది లీలావతి, మాణిక్యం, నూకరత్నం పాల్గొన్నారు.