
క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీలను పరిష్కరించాలి
● కలెక్టర్ విజయ కృష్ణన్
● పీజీఆర్‌ఎస్‌కు 370 అర్జీలు
అనకాపల్లి: పీజీఆర్‌ఎస్‌కు ప్రతి వారం వచ్చే అర్జీలకు అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయి పర్యటనలు చేసి పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌కు అర్జీలు పోటెత్తాయి. ఈ వారం జిల్లా నలుమూలల నుంచి 370 మంది అర్జీదారులు వచ్చారు. వారి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి తీసుకున్న అర్జీల గురించి వెంటనే సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఒకే విషయంపై ఎక్కువసార్లు అర్జీలు వచ్చినట్లయితే అటువంటివి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా సమస్య ఉన్నట్లయితే అర్జీదారుతో సంబంధిత శాఖాధికారులు స్వయంగా వెళ్లి పరిష్కార మార్గాలకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత సమయంలో అర్జీలు పరిష్కరించాలని ఆమె దిగువ స్థాయి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, కేకేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎస్ సుబ్బలక్ష్మి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి, డ్వామా పథక సంచాలకులు శచీదేవి, పూర్ణిమ దేవి, జిల్లా పంచాయతీ అధికారి ఇ.సందీప్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం. హైమావతి, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి వి.సుధీర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సెజ్ పునరావాస గ్రీన్ బెల్ట్ కాపాడండి
అచ్యుతాపురం రూరల్: సెజ్ పునరావాస కాలనీని ఆనుకుని ఉన్న గ్రీన్ బెల్ట్ కాపాడాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కు సోమవారం వైఎస్సార్‌సీపీ నాయకులు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెజ్ కాలనీ చుట్టు పక్కల కాలుష్య కారక పరిశ్రమలు ఉన్నాయన్నారు. ప్రజలు కాలుష్యం బారిన పడకుండా గ్రీన్ బెల్ట్ కోసం 20 సంవత్సరాల క్రితం మొక్కలు నాటినట్లు తెలిపారు. అవి చెట్లుగా మారి 4300 కుటుంబాలు ఒకింత కాలుష్య బారిన పడకుండా ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామాన్ని ఈ ప్రాంతానికి తరలించేందుకు సెజ్ కాలనీ చుట్టు ఉన్న గ్రీన్ బెల్ట్‌లో చెట్లను తొలగిస్తున్నారని, దాని కారణంగా కాలనీ వాసులందరూ అనేక రకాల పరిశ్రమలు, ఫార్మా వ్యర్థ కాలుష్యం బారిన పడి అనారోగ్యానికి గురయ్యే అవకాశముందని వాపోయారు. ఇంకా 500 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాలు కేటాయించాల్సి వస్తే సురక్షిత ప్రాంతం కోసం వేసి చూస్తున్నామన్నారు. ఎంత సంపాదించినా ఆరోగ్యం లేని జీవతం వ్యర్థమని ఆవేదన చెందారు. అధికారులు వెంటనే స్పందించి వేల కుటుంబాలు జీవిస్తున్న సెజ్ పునరావాస కాలనీ కాలుష్యం బారిన పడకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో వియ్యపు కృష్ణ, లాలం శ్రీనువాసరావు దిబ్బపాలెం–2 ఎంపీటీసీ నీరుకొండ అశోక్ కుమార్, పోలవరపు ఉస్తాలు, గాడి గణేష్ సీనియర్ నాయకులు పిల్లి రమణ, జాగారపు శ్రీనువాసరావు తదితరులు పాల్గొన్నారు.

క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీలను పరిష్కరించాలి