ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా స్వామి
నర్సీపట్నం: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర కార్యదర్శిగా నర్సీపట్నానికి చెందిన సిహెచ్.బి.ఎల్.స్వామి ఎన్నికయ్యారు. గురువారం ఒంగోలులో జరిగిన రాష్ట్ర మహా సభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై న సీనియర్ జర్నలిస్టు స్వామి 30 సంవత్సరాల నుంచి పాత్రికేయ రంగంలో ఉన్నారు. నర్సీపట్నం డివిజన్ పరిధిలో పనిచేసిన స్వామి జిల్లా ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శిగా పలుసార్లు సేవలందించారు. జర్నలిస్టుల సమస్యలపై ఉద్యమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర యూనియన్ కార్యదర్శి పదవికి ఈ ప్రాంతం నుంచి మొదటిసారిగా ఎన్నికై న స్వామికి ఉమ్మడి విశాఖ జిల్లా ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అభినందనలు తెలిపారు.


