●మర్యాదపూర్వక కలయిక
● వైఎస్ జగన్‌ను కలిసిన పార్టీ నేతలు
మహారాణిపేట (విశాఖ)/దేవరాపల్లి: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్‌నాథ్, మజ్జి శ్రీనివాసరావులు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వారు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు, మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ కూడా పార్టీ అధినేతను మర్యాదపూర్వకంగా కలిశారు. ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
●మర్యాదపూర్వక కలయిక


