ప్రజా ఉద్యమం
మెడికిల్ ఆపకపోతే
● ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తగదు
● ప్రజా వ్యతిరేక విధానాలను చూస్తూ ఊరుకోం
● చంద్రబాబు సర్కారుకు సీపీఐ, ఎస్‌ఎఫ్‌ఐ హెచ్చరిక
అడ్డురోడ్డులో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల మానవహారం
నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులు
నర్సీపట్నం/ఎస్.రాయవరం:
ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించే చర్యలకు వ్యతిరేకంగా నిరసన హోరెత్తుతోంది. కమ్యూనిస్టు పార్టీలు, విద్యార్థి సంఘాలు చంద్రబాబు సర్కారు విధానాలను విమర్శిస్తూ నిరసన ప్రదర్శనలకు దిగుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాయి. నర్సీపట్నంలో సీపీఐ నాయకులు గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో విద్యార్థులు అడ్డురోడ్డు కూడలిలో మానవహారం నిర్వహించారు. సీపీఐ నాయకులు నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అబిద్‌సెంటరు వరకు ర్యాలీ నిర్వహించి, ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఆర్డీవో కార్యాలయంలో మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్య సేవలు.. పేద విద్యార్థులకు వైద్య విద్య అందించాలంటే మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని పేర్కొన్నారు. పది మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించే 590 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానికంగా మెడికల్ కళాశాల వస్తే దానికి ఆనుకొని 600 పడకల ప్రభుత్వ హాస్పటల్ వస్తుందన్నారు. ఇప్పటి వరకు ఏమైనా అవసరమైతే విశాఖపట్నం కేజీహెచ్‌కు వెళ్లాల్సి వచ్చేదని, మార్గమధ్యంలోనే మరణించిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పెత్త ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి జి.ఫణీంద్ర కుమార్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు బి.వి.రమణ, జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డి అప్పలనాయుడు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాబ్జీ, కార్యవర్గ సభ్యులు రావుజగ్గారావు, పరమేశ్వరి, గురుబాబు, రాధాకృష్ణ, రైతు సంఘం నాయకులు భవాని, సీపీఐ నాయకులు అర్జున్, లక్ష్మి, దొర, దేవుడుబాబు, జగదీష్, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకపోతే ప్రజా ఉద్యమం తప్పదని ఎస్‌ఐఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.బాలాజీ అన్నారు. అడ్డురోడ్డు కూడలిలో గురువారం విద్యార్థులు నిరసన హోరెత్తించారు. గత ప్రభుత్వంలో పేద, మధ్యతరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 కళాశాలల నిర్మాణం చేపడితే.. చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడతాననడం దారుణంగా ఉందన్నారు. గతంలో ఇటువంటి అవకాశాలు లేక గ్రామాల్లో ప్రతిభ కల విద్యార్థులు సైతం పెద్ద చదువులకు దూరంగా ఉండిపోయారన్నారు. విద్యార్థులకు బకాయిపడ్డ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఏడు వేల కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలన్నారు. మానవహారం నిర్వహించి నినాదాలతో హోరెత్తించా రు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చిన్న, తాతాజీ, మహేష్, లక్ష్మణ్, దివ్య, పుష్ప, భవాని, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ఉద్యమం
ప్రజా ఉద్యమం


