అంతర్జాతీయ మోడలింగ్‌లో మెరిసిన విశాఖ చిన్నారి | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ మోడలింగ్‌లో మెరిసిన విశాఖ చిన్నారి

May 31 2025 1:33 AM | Updated on May 31 2025 1:33 AM

అంతర్జాతీయ మోడలింగ్‌లో మెరిసిన విశాఖ చిన్నారి

అంతర్జాతీయ మోడలింగ్‌లో మెరిసిన విశాఖ చిన్నారి

అక్కిరెడ్డిపాలెం: షీలానగర్‌లోని బీవీకే స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల జినిషా అలికానా ‘సూపర్‌ గ్లో జూనియర్‌ మోడల్‌ ఇంటర్నేషనల్‌’గా ఎంపికై ంది. ఈమె తండ్రి రాంబాబు అలికానా ఎయిర్‌ ఇండియాలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తుండగా, తల్లి కావ్య గృహిణి. జినిషా మొదటిసారిగా గాజువాకలో జరిగిన మెస్సీ ఈవెంట్‌లో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత గోవాలో జరిగిన కార్యక్రమంలో 54 మంది పోటీదారుల్లో రెండో స్థానంలో నిలిచి తన సత్తా చాటింది. ఆగస్టులో వియత్నాంలో నిర్వహించే అంతర్జాతీయ పోటీకి జినిషా ఎంపికై నట్లు ఆమె తండ్రి రాంబాబు తెలిపారు. గోవా ఆడిషన్‌లో జినిషా నెమలి వేషధారణలో చేసిన ప్రదర్శన పలువురి ప్రశంసలు పొంది, ఆమెను ఫస్ట్‌ రన్నరప్‌గా నిలబెట్టింది. వియత్నాంలో జరగనున్న పోటీలో జినిషా విజయం సాధించాలని ఆమె స్నేహితులు, ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement