
ధ్యానోత్సవాలు ప్రారంభం
పెందుర్తి: స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్, ఉత్తరాంధ్ర ధ్యాన మాస్టర్ల సంయుక్త ఆధ్వర్యంలో తలపెట్టిన బుద్ధ పౌర్ణమి ధ్యానోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ధ్యాన మాస్టర్లు మాట్లాడుతూ నిరంతర ధ్యాన ప్రక్రియ వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. ధ్యానాన్ని నిత్య జీవనంలో భాగం చేసుకోవాలని సూచించారు. మనిషి మంచి నడవడిక కోసం గౌతమ బుద్ధుని అడుగుజాడల్లో నడవాలని సూచించారు. తొలిరోజు సంగీత ధ్యానంతో ప్రారంభమైంది. అనంతరం సీతమ్మధారకు చెందిన కృష్ణవేణి ఆధ్వర్యంలో శాసీ్త్రయ సంగీతం, రమణి బృందం ఆధ్వర్యంలో రమణీయ రాగాలు, నోరి గాయిత్రి ఆధ్వర్యంలో వీణా నాద ధ్యానం, మిట్టా మనోహర్ ఆధ్వర్యంలో ఆచార్య సాంగత్యం, కృష్ణవేణి బృందం ఆధ్వర్యంలో నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల నుంచి ధ్యాన మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు.