
ప్రకృతి వ్యవసాయంతో ఎన్నో ప్రయోజనాలు
యలమంచిలి రూరల్: ప్రకతి వ్యవసాయంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని జిల్లా వ్యవసాయాధికారి వ్యవసాయాధికారి మోహన్‌రావు అన్నారు. మండలంలోని రామారాయుడుపాలెం, పోతురెడ్డిపాలెం, తురంగలపాలెం గ్రామాల్లో రబీ సీజన్‌లో సాగు చేస్తున్న వరి ఎన్‌ఎల్‌ఆర్ 3648 రకం పైరును గురువారం ఆయన పరిశీలించారు. ఈ రకం వరి వంగడాలు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటాయన్నారు. వరి దుబ్బులను పరిశీలించిన తర్వాత అధిక దిగుబడి పొందవచ్చన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో రైతులకు ప్రకతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో మండలంలో సుమారు 2వేల ఎకరాల్లో ప్రకతి వ్యవసాయం ద్వారా వివిధ పంటలను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రకతి వ్యవసాయం సాగు వల్ల రైతులకి, భూమికి, పర్యావరణానికి, ప్రధాన పంట వినియోగదారునికి కలిగే ప్రయోజనాలను ఏవో రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ రకాల విత్తనాలను వేయడం ద్వారా ఎకరాకు వచ్చే పంట దిగుబడిపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏవోలు పొలిమేర మోహన్‌రావు, సుమంత, సౌజన్య, శంకర్ గోవింద్, రైతు సేవా కేంద్రం సిబ్బంది, ప్రకతి వ్యవసాయం సిబ్బంది పాల్గొన్నారు.