
ప్రధాన అర్చకుడికి పట్టువస్త్రాల సమర్పణ
సింహాచలం: సింహగిరిపై వచ్చేనెల 2న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చైన్నెకి చెందిన వెంకటరమణ 1.70 లక్షలు, డి.అప్పారావు 1.41 లక్షలు, ఎస్.కె.మూర్తి 1.40 లక్షల విలువ చేసే పట్టువస్త్రాలను కానుకగా అందజేశారు. ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఏఈవో నరసింహరాజు, సూపరింటెండెంట్ పాలూరి నరసింగరావుకి వీటిని అందజేశారు. అలాగే నగరంలోని గోపాలపట్నానికి చెందిన స్వర్ణ జ్యూయలర్స్ ప్రతినిధులు కేజీ ముత్యాల తలంబ్రాలను కానుకగా అందించారు. దేవస్థానం ఈవో వి.త్రినాథరావుకి వీటిని అందజేశారు.