
కోర్సు ప్రారంభిస్తున్న వీసీ ప్రసాదరెడ్డి
ఏయూ క్యాంపస్: ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే మూక్స్‌లో ఐపీఆర్ కోర్సును భాగం చేశారు. బుధవారం సాయంత్రం ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాద రెడ్డి దీనిని ప్రారంభించారు. ఐపీఆర్ కోర్సుకు సంబంధించిన సిలబస్‌ను డీపీఐఐటీ ఐపీఆర్ చెయిర్ తీర్చిదిద్దింది. ఐపీఆర్ చెయిర్ ప్రొఫెసర్ డాక్టర్ హనుమంతు పురుషోత్తం మాట్లాడుతూ ఐపీఆర్‌ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొన్ని యూజీ, పీజీ కోర్సుల్లో అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉంచిన మూక్ కోర్సును ఎవరైనా పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. రెక్టార్ ఆచార్య కె.సమత, పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, కంప్యూటర్ సెంటర్ సంచాలకులు ఆచార్య భాస్కరరెడ్డి, ఐపీఆర్ చెయిర్ గౌరవ సంచాలకులు ఆచార్య పురుషోత్తం, ఎలియన్స్ టాలెంట్ ఎడ్జ్ సంస్థ మేనేజర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు.