తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): చైన్నె డివిజన్, చైన్నె సెంట్రల్–బేసిన్ బ్రిడ్జి మధ్య బ్రిడ్జి పునర్నిర్మాణం నిమిత్తం ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్టు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ● ధన్‌బాద్‌లో ఈ నెల 31 నుంచి వచ్చేనెల 24వ తేదీ వరకు బయల్దేరే ధన్‌బాద్–అలప్పుజ (13351) ఎక్స్‌ప్రెస్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ మీదుగా కాకుండా వయా కొరుక్కుపేట, వ్యాసర్‌పడి, పెరంబూర్ మీదుగా నడుస్తుంది. ప్రయాణికుల సౌకర్యార్థం పెరంబూర్‌లో హాల్ట్ ఇచ్చారు. ● అలప్పుజలో వచ్చే నెల 2న బయల్దేరే అలప్పుజ–ధన్‌బాద్(13352) ఎక్స్‌ప్రెస్ ఎంబీఆర్ చైన్నె సెంట్రల్ మీదుగా కాకుండా వయా పెరంబూర్, కొరుక్కుపేట, చైన్నె బీచ్ స్టేషన్‌ల మీదుగా నడుస్తుంది. ప్రయాణికుల సౌకర్యార్ధం పెరంబూర్, చైన్నె బీచ్ స్టేషన్లలో హాల్ట్ ఇచ్చారు.