
108 వాహనంలో బాలుడిని తరలిస్తున్న దృశ్యం
హుకుంపేట: మండలంలోని మత్యపురం గ్రామంలో బాలుడికి విద్యుత్ తీగ తగిలి తీవ్ర గాయలయ్యాయి. గ్రామానికి చెందిన జి.సుమతి, బొజ్జన్న కు మారుడు అజయ్ (11) మంగళవారం ఇక్కడ పెదగరువు వంతెన సమీపంలో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురయ్యాడు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. అక్కడ నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. హుకుంపేట ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పెదగరువు వంతెన సమీపంలో విద్యుత్ తీగలు వేలాడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.