కొయ్యూరు: మండలంలోని చింతలపూడి నుంచి చోద్యం వరకు ఉన్న 24 కిలోమీటర్ల ప్రధాన రహదారి పూర్తిగా పాడైపోయిందని, వెంటనే దాని స్థానంలో కొత్త రహదారిని నిర్మించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ మాట్లాడుతూ.. గతంలో వేసిన రోడ్డు పూర్తిగా ధ్వంసమై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు బాలారం నుంచి బకులూరు వరకు ఉన్న నాలుగు కిలోమీటర్ల రహదారిని, కించెలి నుంచి చమ్మచింత వరకు ఉన్న ఐదు కిలోమీటర్ల మేర రోడ్డును తక్షణమే నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఐ నేతలు ఉల్లి సూరిబాబు, ఇరువాడ దేముడు, కార్మిక సంఘం నాయకులు వియ్యపు నానాజీ, గిరిజన సమాఖ్య మండల కార్యదర్శి ధార మల్లేష్, మొల్ల సుబ్బారావు, పొట్టిక మలేష్ పాల్గొన్నారు.


