క్వాంటమ్‌ కంప్యూటర్‌పరీక్షల్లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

క్వాంటమ్‌ కంప్యూటర్‌పరీక్షల్లో ప్రతిభ

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

ముగ్గురు చింతపల్లి విద్యార్థినులకు అభినందన

చింతపల్లి: స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులకు మంగళవారం విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నిర్వాహకులు ప్రశంసా పత్రాలను అందించినట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విజయభారతి తెలిపారు. తమ కళాశాలకు చెందిన సీహెచ్‌భవాని, ఆర్‌.విమోచన, వి.కృష్ణవేణి ఇటీవల విశాఖలో నిర్వహించిన క్వాంటమ్‌ కంప్యూటర్‌ పరీక్షల్లో ప్రతిభ కనపరిచారన్నారు. ఈ మేరకు వారిని విజయవాడ ఆహ్వానించినట్టు తెలిపారు. అక్కడ మిషన్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న ప్రశంసాపత్రాలతోపాటు నగదు బహుమతులను అందించినట్టు ప్రిన్సిపాల్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement