రైల్వే చట్టం–1989 ప్రకారం తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే జోన్లను పునర్‌వ్యవస్థీకరించి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేశారు. మంగళవారం విడుదలైన గెజిట్ ప్రకా రం జూన్ 1 నుంచి ఈ జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. జోన్ పరిధిలో మొత్తం నాలుగు డివిజన్లు ఉంటాయి. గతంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను ఈ జోన్‌లో చేర్చారు. అదేవిధంగా వాల్తేరు డివిజన్‌ను విభజించి.. దానిలో కొంత భాగంతో కొత్తగా విశాఖపట్నం డివిజన్‌ను ఏర్పాటు చేశారు. మరోవైపు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు కొనసాగనున్నాయి.


