పరిశ్రమలకు భూములిచ్చిన రైతులపై పోలీసుల నిర్బంధం తగదు
అధికారులతో కుమ్మకై ్క రైతుల గొంతు నొక్కేస్తున్న బ్రాండిక్స్ యాజమాన్యం
కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు గుణపాఠం తప్పదు
చలో దుప్పితూరు కార్యక్రమంలో
వైఎస్సార్‌సీపీ నాయకులు
నిర్వాసితులకు అండగా ఉంటామని వెల్లడి
అచ్యుతాపురం రూరల్ : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మండలంలో దుప్పితూరు గ్రామాన్ని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ముఖ్య నాయకులు హాజరై దుప్పితూరు గ్రామస్తులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్‌నాఽథ్, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు శోభా హైమవతి, నర్సీపట్నం నియోజకవర్గ పరిశీలకులు భీశెట్టి సత్యవతి, మాజీ ఎంపీపీ ఎస్‌ఈసీ సభ్యులు బోదెపు గోవింద్, అనకాపల్లి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత, నాలుగు మండలాల వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.
గ్రామస్తులకు అండగా వైఎస్సార్‌సీపీ :
మాజీ మంత్రి అమర్‌నాథ్
గ్రామస్తుల సమస్యలు పరిష్కరించి పరిశ్రమలు నెలకొల్పాలని మాజీ మంత్రి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. దశాబ్దాలు గడుస్తున్నా నిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీ ఇవ్వకుండా అక్రమంగా ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టడం, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి, మహిళలను సైతం ఈడ్డుకుంటూ బలవంతంగా వ్యాన్లలో తరలించడం అత్యంత దుర్మార్గపు చర్య అన్నారు. ఇటువంటి సంస్కృతి మునుపెన్నడూ చూడలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దుప్పితూరు గ్రామస్తుల సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు.
ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా..: ధర్మశ్రీ
ఇంటికో ఉద్యోగం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, పునరావాసం కల్పించాలని అడిగినందుకు మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా అరెస్ట్‌లు చేయడం అత్యంత దుర్మార్గమని యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. భూ నిర్వాసితులపై ఆటవికంగా వ్యవహరించడమంటే ప్రజా స్వామ్యంలోనే ఉన్నామా? అనే దుస్థితి నెలకొందన్నారు.
భూములిచ్చిన రైతుల గోడు పట్టదా...?
బొడ్డేడ ప్రసాద్
కార్పొరేట్ కంపెనీలకు తొత్తులుగా మారి బలవంతంగా భూ సేకరణలు చేసి రైతులకు అన్యాయం చేయాలని కోవడం అప్రజాస్వామ్యమని అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. 22 సంవత్సరాలుగా దుప్పితూరు గ్రామస్తులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. నిర్వాసితుల సమస్యలు పూర్తిగా పరిష్కరించే వరకూ ప్రహరీ నిర్మాణ పనులు వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
మహిళలపై అనుచితంగా ప్రవర్తించడం కిరాతకం : మాజీ ఎంపీ సత్యవతి
అక్రమ కేసులతో గ్రామస్తులను భయబ్రాంతులకు గురిచేసి పోరాటాలను ఆపాలనే దురాలోచన అత్యంత దుర్మార్గమని మహిళలపై అనుచితంగా వ్యవహరించడం అత్యంత కిరాతకమని అనకాపల్లి మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి అన్నారు. దుప్పితూరు సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వక్తలు హామీ ఇచ్చారు. వైఎస్‌ఆర్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు అధ్యక్షతన జరిగిన ఈ చలో దుప్పితూరు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేశంశెట్టి పైడియ్యనాయుడు, ఉప సర్పంచ్ దేశంశెట్టి ఈశ్వర్రావు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ శెట్టి నాగేశ్వర్రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రగడ తాతబాబు, భావనారుషి ఆలయ కమిటీ అధ్యక్షుడు మాడెం సూరి అప్పారావు పాల్గొన్నారు.
గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి అమర్‌నాథ్, వైఎస్సార్‌సీపీ నాయకులు


