బాబు మాటను బేఖాతరు చేసిన కేంద్రం | - | Sakshi
Sakshi News home page

బాబు మాటను బేఖాతరు చేసిన కేంద్రం

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

వాల్తేరు డివిజన్‌లో కీలక ఆదాయాన్ని తెచ్చిపెట్టే కేకే లైన్‌ను విశాఖలోనే ఉంచాలంటూ జోన్‌ ప్రకటన వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీలు పోరాటం చేస్తూనే ఉన్నారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ఇటీవల డేటా సెంటర్‌ శంకుస్థాపనకు వచ్చిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చంద్రబాబు చర్చించారు. అరకుతో కూడిన కేకే లైన్‌ విశాఖ జోన్‌లో కలపాలని కోరారు. అప్పుడే చంద్రబాబు అభ్యర్థనను రైల్వే మంత్రి తోసి పుచ్చినట్లు సమాచారం. ఇప్పుడు వాల్తేరు డివిజన్‌ విభజన తీరు చూస్తుంటే కేంద్రం వద్ద చంద్రబాబు పరపతి ఏపాటిదో అర్థమవుతోంది. కేకే లైన్‌ను ఒడిశాకే కట్టబెడుతూ గెజిట్‌ విడుదల చేయడం బాబు అసమర్థతకు నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ముడసర్లోవలో కొనసాగుతున్న

జోన్‌ ప్రధాన కార్యాలయం పనులు

Advertisement
 
Advertisement
Advertisement