పాఠశాల బస్సుల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పాఠశాల బస్సుల తనిఖీ

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

చింతపల్లి: జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి విద్యార్థులను చేరవేస్తున్న బస్సుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిరమేష్‌ తెలిపారు. మంగళవారం చింతపల్లిలోని కింగ్స్‌ ఆర్మీ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలకు చెందిన బస్సులను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సుల్లోని సీటింగ్‌ సదుపాయాలు, విద్యార్థుల భద్రతకు అవసరమైన అత్యవసర పరికరాలు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు వంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు వివరించారు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు చేపడుతున్నట్లు సాయిరమేష్‌ పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement