డాబాగార్డెన్స్: జీవీఎంసీ 27వ వార్డు పరిధి శంకరమఠం వెనుక ఉన్న ఇందిరా సంజీవ్ భీమ్‌నగర్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ వార్డు అధ్యక్షుడు నీలాపు సర్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఎంపీ గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ.. సేవలోనే భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని, అదే అంబేడ్కర్ ఆలోచన విధానమని గుర్తు చేశారు. పేదలు, దళితులు విద్యావంతులైనప్పుడే వారికి సమాజంలో సరైన న్యాయం, గౌరవం లభిస్తాయన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నీలాపు సర్వేశ్వరరెడ్డి చిన్నారులకు పుస్తకాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్‌వెస్లీ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ, రవిరాజు, పద్మనాభం అమ్మాజీ, రెయ్యి డేవిడ్‌రాజు, గనగల రామరాజు, ఈతలపాక విజయ్, బోని శివరామకృష్ణ, దేవరకొండ మార్కండేయలు, సనపల రవీంద్రభరత్, కోన శంకర్, చోడిపిల్లి శివ, ఆకుల శ్యామ్, గోవింద్, పైలా అప్పలరాజు, మోహన్, కె.అప్పన్న, లాజర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
భీమ్‌నగర్‌లో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ


