దేవస్థానం సొసైటీ ఎన్నికల్లో హరి ప్యానెల్‌ గెలుపు | - | Sakshi
Sakshi News home page

దేవస్థానం సొసైటీ ఎన్నికల్లో హరి ప్యానెల్‌ గెలుపు

Apr 1 2026 7:36 AM | Updated on Apr 1 2026 7:36 AM

సింహాచలం: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ ఎన్నికలు ప్రహ్లాదపురంలోని సొసైటీ కల్యాణమండపంలో మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 206 ఓట్లకు 168 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారి నిరంజన్‌ పట్నాయక్‌ తెలిపారు. 9 మంది సభ్యులకు గాను పోటీలో 14 మంది(రిటైర్డ్‌ ఉద్యోగులు, ప్రస్తుతం విధుల్లో నిలిచిన ఉద్యోగులు) నిలిచారు. వీరిలో డి.వి.ఎస్‌.రామరాజు(హరి) ప్యానెల్‌ విజయం సాధించింది. డి.వి.ఎస్‌.రామరాజు, గొడవర్తి శ్రీనివాసాచార్యులు, సుంకర సన్యాసిరావు(తాతాజీ), టీపీఎన్‌ మూర్తి, వై.అప్పారావు, ముగ్గు వరహాలరావు, లంక సూరిబాబు, కోరాడ శ్రీనివాస సాయి, గెడ్డపు సన్యాసి విజయం సాధించారు. బుధవారం అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement