
వలజంగిలో వణికిస్తున్న జ్వరాలు
చిన్నారి మృతి
ముంచంగిపుట్టు: మండలంలోని రంగబయలు పంచాయతీ వలజంగి గ్రామ గిరిజనులను జ్వరాలు వణికిస్తున్నాయి. చిన్నాపెద్ద అన్న తేడా లేకుండా పలువురు జ్వరం,శరీరంపై కురుపులతో బాధపడుతున్నారు. జ్వరంతో కొన్ని రోజులుగా బాధపడుతున్న గ్రామానికి చెందిన వంతాల తులసి(4) ఆదివారం మృతి చెందింది.ప్రసుత్తం గ్రామంలో వంతాల కనుమ,వంతాల రాధ,వంతాల మీనా,వంతాల సుశాంత్ అనే చిన్నారులతో పాటు 10మంది జ్వరం,కురుపులు తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నారుల పరిస్థితి తీవ్రంగా ఉండడంతో తల్లిదండ్రులు భయాందోళనలు చెందుతున్నారు. జ్వరంతో నాలుగు ఏళ్ల చిన్నారి మృతి చెందడంతో గ్రామస్తులు భయపడుతున్నారు. తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి వలజంగిలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వైస్‌ఎంపీపీ సిరగం భాగ్యవతి, గ్రామస్తులు కోరారు.

వలజంగిలో వణికిస్తున్న జ్వరాలు