
ఇద్దరు అటవీ ఉద్యోగులు సస్పెన్షన్
8లో
అడ్డతీగల: రైతు వారీ టేకుచెట్ల అక్రమ నరికివేతకు సహకరించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే కారణంతో అడ్డతీగల అటవీ క్షేత్రం పరిధిలో పనిచేస్తున్న ఒక డిప్యూటీ రేంజ్ అధికారితో పాటు బీటు ఆఫీసర్‌ని సస్పెండ్ చేస్తూ అటవీశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అడ్డతీగల అటవీ క్షేత్రం పరిధిలోని పెద్దమునకనగడ్డలో కలప రవాణాదారులు ఓ రైతు వద్ద కొనుగోలు చేసిన 25 టేకుచెట్ల నరికివేత వ్యవహారం ఈ సస్పెన్షన్‌లకు దారితీసింది.ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారం వివరాలిలా ఉన్నాయి. సేకరించిన టేకు కలపను రవాణాదారులు రాజమహేంద్రవరంలోని ఓ సా మిల్లుకు తరలించారు.కలప రవాణా జరిగిందని స్క్వాడ్ డీఎఫ్‌వో ఎం.వి. ప్రసాదరావుకు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి, రూ.3.60 లక్షలు జరిమానా విధించారు.జరిమానా చెల్లించకపోగా క్షేత్రస్థాయిలో సిబ్బందికి అధిమొత్తంలో నగదు ఇచ్చామని కలప రవానాదారులు వాంగ్మూలం ఇచ్చారని తెలిసింది.కలప నరికి వేత నుంచి రవాణా వరకూ క్షేత్రస్థాయి సిబ్బంది నిబంధనలు అనుసరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్క్వాడ్ డీఎఫ్‌వో ప్రసాదరావు రాజమహేంద్రవరం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బి.ఎన్.ఎన్. మూర్తికి నివేదిక సమర్పించారు.దీనిపై అడ్డతీగల డీఆర్వో రాజారావు,వేటమామిడి బీటు ఆఫీసర్ బసవయ్యని సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.కాగా ఈ వ్యవహారంలో పర్యవేక్షణ చేయవలసిన అధికారుల నిర్లక్ష్యం వెల్లడి కావడంతో మరికొందరిపైనా శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.దీనిపై అడ్డతీగల సబ్ డీఎఫ్‌వో సుబ్బారెడ్డిని వివరణ కోరగా ఇద్దరు అటవీ ఉద్యోగు లు సస్పెన్షన్ విషయం వాస్తవమేనని, తన వద్దకు ఫైల్ వచ్చిన తరువాత పూర్తివివరాలుతెలియజేస్తానన్నారు.

ఇద్దరు అటవీ ఉద్యోగులు సస్పెన్షన్