
క్షయ నియంత్రణకు కృషి
● డాక్టర్ కిరణ్‌కుమార్
పెదబయలు: గ్రామ స్థాయిలో క్షయ నియంత్రణకు సిబ్బంది కృషి చేయాలని జిల్లా కుష్టు, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ ఎం. కిరణ్‌కుమార్ అన్నారు. గోమంగి పీహెచ్‌సీలో ఆశ డే సందర్భంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్షయ వ్యాధి నిర్మూలన, క్షయ ముక్త్ భారత్ అభియాన్ ప్రాముఖ్యతను క్షేత్ర స్థాయి సిబ్బందికి వివరించారు. ప్రధాన మంత్రి మాతృత్వ సురక్షత్ అభియాన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పెదబయలు, గోమంగి సీహెచ్‌సీల వైద్యాధికారులు నిఖిల్, చైతన్య, ముంచంగిపుట్టు క్షయ నియంత్రణ సూపర్‌వైజర్ మూర్తి, సిబ్బంది నాగేశ్‌దొర, రామరాజు, పీహెచ్‌సీ వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.