సంక్షేమ సారఽథి వైఎస్‌ | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ సారఽథి వైఎస్‌

Jul 9 2025 6:43 AM | Updated on Jul 9 2025 6:43 AM

సంక్ష

సంక్షేమ సారఽథి వైఎస్‌

సాక్షి,పాడేరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేదల సంక్షేమానికి విశేష కృషి చేసిన రైతు బాంధవుడు, మహానేత, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. జిల్లా కేంద్రం పాడేరు పాతబస్టాండ్‌లో మహానేత వైఎస్‌ విగ్రహం వద్ద మంగళవారం ఘనంగా జయంతి నిర్వహించారు. వైఎస్‌ విగ్రహానికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, పార్టీ ఎస్టీసెల్‌ వరాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఇతర నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ మహానేత వైఎస్సార్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకంతో పేద గిరిజనులకు కార్పొరేట్‌ వైద్యం, అటవీ భూములకు హక్కులు కల్పించిన మహోన్నత నేతగా గిరిజనుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన తెలిపారు. వైఎస్సార్‌ పేదల పెన్నిధి అని గిరిజనులకు ఎంతో మేలు చేశారని కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్‌మెంట్‌, ఇందిరమ్మ ఇళ్లు, అటవీ హక్కుల చట్టంతో పోడు భూములకు పట్టాలు, కోటి ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మహానేత ఆశయా లకు అనుగుణంగా పనిచేస్తున్న మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని 2029 ఎన్నికల్లో సీఎంగా చేసుకునే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలంతా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, పాడేరు నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లో ఉర్వశిరాణి, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్‌, ఎంపీటీసీ లకే రాామకృష్ణపాత్రుడు, సర్పంచ్‌లు వనుగు బసవన్నదొర, వంతాల రాంబాబు, గబ్బాడి చిట్టిబాబు, గొల్లోరి నీలకంఠం, పార్టీ నాయకులు లకే రామసత్యవతి, కిల్లు కోటిబాబునాయుడు, లకే రత్నాభాయి, కూడా సుబ్రహ్మణ్యం, బాబూరావు, వంతాల నరేష్‌, బూర మహేష్‌, డి.పి.రాంబాబు, వలంటీర్ల విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొమ్మ సురేష్‌బాబు, జిల్లా అధ్యక్షుడు కొమ్మ రాంబాబు పాల్గొన్నారు. మండలంలోని కాడెలి పంచాయతీ గురుపల్లి గ్రామంలో వైఎస్సార్‌ జయంతిని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఘనంగా నిర్వహించింది. మహానేత విగ్రహానికి జిల్లా మహిళా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర..

అరకులోయ టౌన్‌: పేదల సంక్షేమానికి చిరునామా వైఎస్సార్‌ అని వైఎస్సార్‌సీపీజిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరాజు అన్నారు. అరకులో మంగళవారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో ఆయన జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయన చేసిన మంచిని ఎన్నటికీ మరువలేరన్నారు. ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ వైఎస్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయని అన్నారు. వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం కేక్‌కట్‌ చేశారు. పార్టీ జెండా ఎగరవేశారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుమ్మ తనూజరాణి, ఎమ్మెల్సీ రవిబాబు, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, మాజీ ఎంపీ మాధవి, మాజీ ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, హైమావతి, మాజీ జీసీసీ చైర్‌పర్సన్‌ స్వాతిరాణి, జెడ్పీటీసీలు రోషిణి, జానకమ్మ, ఎంపీపీలు నీలవేణి, ఈశ్వరి, పాంగి చిన్నరావు, శెట్టి అప్పాలు, రేగం చాణక్య, ఆశోక్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

సంక్షేమాన్ని ప్రజల చెంతకు తెచ్చిన నేత : మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి

రాజవొమ్మంగి: సంక్షేమాన్ని ప్రజల చెంతకు తెచ్చిన పేద బడుగు బలహీనవర్గాల పెన్నిధి డాక్టర్‌ రాజశేఖరరెడ్డి అని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. మంగళవారం రాజవొమ్మంగిలో జరిగిన జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. గాంధీబొమ్మ సెంటర్లోని రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఆమె క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటికీ పేద కుటుంబాల్లో వైఎస్‌ చిరస్థాయిగా ఉన్నారన్నారు. స్థానిక పీహెచ్‌సీలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు శింగిరెడ్డి రామకృష్ణ, సర్పంచ్‌లు కొంగర మురళీకృష్ణ, ఆగూరి శుభలక్ష్మి, కించు వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు గంగదుర్గ, లోవకుమారి, నాయకులు నాగులాపల్లి కుశరాజు, కనిగిరి దుర్గాప్రసాద్‌, ఆధ్య రమేష్‌, కనిగిరి వీరబాబు, చీడిపల్లి శాంతకుమారి, అడపా కామేష్‌, శింగిరెడ్డి రవి, జుర్రా జాన్‌బాబు, చింతలపూడి వెంకటరమణ, మాడి బాబ్జీ, పండూరి బుజ్జి, గండేపల్లి రాంబాబు, బొడ్డు వెంకటరమణ, నూకరాజు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు

ఘనంగా వైఎస్‌ జయంతి

వాడవాడలా సేవా కార్యక్రమాలు

ఉత్సాహంగా నిర్వహించిన పార్టీ శ్రేణులు

సంక్షేమ సారఽథి వైఎస్‌1
1/2

సంక్షేమ సారఽథి వైఎస్‌

సంక్షేమ సారఽథి వైఎస్‌2
2/2

సంక్షేమ సారఽథి వైఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement