
1500 పెంపుడుశునకాలకు వ్యాక్సినేషన్
● పశుసంవర్ధక శాఖ ఏడీ
రాజా రవికుమార్
పాడేరు : పెంపుడు శునకాలకు తప్పనిసరిగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు వేయించాలని పశు సంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రాజా రవికుమార్ సూచించారు. ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పశువుల ఆస్పత్రుల్లో 1500 పెంపుడు శునకాలకు ఉచితంగా వ్యాక్సిన్ వేశారు. మిగిలిన వాటికి కూడా వ్యాక్సిన్ వేయించవచ్చన్నారు. లైవ్ స్టాక్ అధికారి సురేష్, వెటర్నరీ అసిస్టెంట్లు శ్రీను, కోటి, ఉమ, రామకృష్ణ, చంద్రమోహన్, బాబూరావు పాల్గొన్నారు.