ఈదురుగాలులతో ఆటోపై కూలిన విద్యుత్‌ స్తంభం | - | Sakshi
Sakshi News home page

ఈదురుగాలులతో ఆటోపై కూలిన విద్యుత్‌ స్తంభం

Jun 10 2025 7:03 AM | Updated on Jun 10 2025 7:03 AM

ఈదురు

ఈదురుగాలులతో ఆటోపై కూలిన విద్యుత్‌ స్తంభం

● త్రుటిలో తప్పిన ప్రమాదం ● నుజ్జనుజ్జయిన ఆటో

డుంబ్రిగుడ: మండలం కేంద్రంలోని కళాశాల రోడ్డులో సోమవారం చిన్నపాటి గాలులతో నీలగిరి చెట్టు కొమ్మ విరిగిపడి విద్యుత్‌ తీగలపై పడింది. దీన్ని ప్రభావంతో విద్యుత్తు స్తంభం నేలకొరిగి ఆటోపై పడింది. దీంతో గ్రామానికి చెందిన కమ్మిడి గురుకృష్ణ అనే గిరిజన నిరుద్యోగ యువకుడి ఆటో నుజ్జనుజ్జయ్యింది. ప్రతి రోజు ఈ మార్గంలో కళాశాల విద్యార్థులతో పాటు గ్రామస్తులు రాకపోకలు సాగిస్తుంటారు. వాస్తవానికి ఆటోలో గ్రామ పిల్లలు కూర్చునేవారు అయితే గ్రామంలో చిన్న పాటి కార్యక్రమం జరుగుతుండటంతో అందరు అక్కడ ఉన్న తరుణంలో ఈ సంఘటన జరిగింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్ధానికులు విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. రోడ్డుపై పడ్డ చెట్టును గ్రామస్తుల సాయంతో తొలగించి, విద్యుత్తుని పునరుద్దరించారు. ఆటోతో ఉపాధి పొందుతున్న తనకు ఆటో మరమ్మత్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అధికారులు స్పందించి నష్ట పరిహారం అందించాలని బాధితుడు కమ్మిడి గురుకృష్ణ చెబుతున్నారు.

ఈదురుగాలులతో ఆటోపై కూలిన విద్యుత్‌ స్తంభం 1
1/1

ఈదురుగాలులతో ఆటోపై కూలిన విద్యుత్‌ స్తంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement