
మావోయిస్టులకుసహకరించవద్దు
మోతుగూడెం: రాష్ట్ర సరిహద్దు పరిసర ప్రాంతా ల్లో మావోయిస్టుల సంచరిస్తున్నట్టు సమాచారం ఉందని, గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని చింతూరు సీఐ తెల్లం దుర్గాప్రసాద్ అన్నారు. డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్టగూడెం గ్రామాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ప్రజలతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని కోరారు. మావోయిస్టులు వచ్చినట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం గ్రామస్తులకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీ కె.కల్యాణ్, మొహిద్దిన్, పోశయ్య తదితరులు పాల్గొన్నారు.