
బాలికలకు నృత్య శిక్షణ ప్రారంభం
సాక్షి,పాడేరు: పట్టణంలోని గిరి కై లాస క్షేత్రం ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బాలికలకు భరత నాట్యం, కూచిపూడి నృత్యంశిక్షణ తరగతులను ఆదివారం ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనృత్యాంజలి అకాడమి భరతనాట్య శిక్షకులు చైతన్య ప్రభు ఆధ్వర్యంలో తొలిరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల సీతారామశాస్త్రి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరత్నం, ఆధ్యాత్మిక మహిళా సేవాబృందం సభ్యులు మయూరి, సత్యవతి, నిర్మల, జ్యోతి పాల్గొన్నారు.