
పందికుంట బయలు భూములు ఇచ్చేది లేదు
● అధికారులకు గిరిజనుల స్పష్టీకరణ
రంపచోడవరం: ఎన్నో ఏళ్లుగా గిరిజనుల సాగులో ఉన్న పందికుంట బయలు భూములను ఎవరికి ఇచ్చేది లేదని అఖిల భారత రైతు కూలీ సంఘం డివిజన్ కార్యదర్శి పల్లాల లచ్చిరెడ్డి, పీవోడబ్ల్యూ జిల్లా నాయకుడు పి అనసూయ తెలిపారు. తహసీల్దార్ రామకృష్ణ తన కార్యాలయంలో శనివారం గిరిజనులతో సమావేశమయ్యారు. చింతూరు, ఎటపాక, వీఆర్ పురం, కూనవరం, మండలాల పోలవరం నిర్వాసితులకు పందికుంట బయలు భూములు ఇవ్వాలని రంపచోడవరం రెవెన్యూ అధికారులు, చింతూరు ఎస్‌డీసీ అడిగారు. ఇందుకు వారు నిరాకరించారు. ఐదు గ్రా మాలకు చెందిన సుమారు 138 మంది 600 ఎకరాలను 26 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నట్లు గిరిజనులు తెలిపారు. వీటికి సంబంధించి పూర్తి హక్కు లు తమకు కల్పించాలని వారు విన్నవించారు.