నవ్వు గురూ.. | - | Sakshi
Sakshi News home page

నవ్వు గురూ..

May 4 2025 6:45 AM | Updated on May 4 2025 6:45 AM

నవ్వు

నవ్వు గురూ..

నవ్వులు పూయిస్తున్న హాస్య క్లబ్‌లు

ఆధునిక జీవితంలో ఒత్తిడి పెరిగిపోయి.. మనిషి నవ్వుకు దూరమవుతున్నాడు. టీవీ, మొబైల్‌ ఫోన్‌ వినియోగం పెరిగిన తర్వాత కుటుంబ సభ్యులు, పిల్లలు, స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ నవ్వడమే మరిచిపోయాం. కానీ నవ్వు మన ఆరోగ్యానికి అత్యవసరం. ఇది ఒక టానిక్‌లా పనిచేస్తుంది. వైద్యుల ప్రకారం నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కేవలం 10 నిమిషాలు నవ్వితే రెండు గంటల నడకతో సమానమైన శక్తి లభిస్తుంది. నవ్వినప్పుడు మూడు వేల నాడులు పనిచేస్తాయి. నవ్వు మెదడులో ‘గామా ఇంటర్‌ఫెరాన్‌’ అనే హార్మోన్‌ను విడుదల చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మనిషి శిశువుగా ఉన్నప్పుడు రోజుకి 325 సార్లు నవ్వితే.. ఊహ తెలిసిన తర్వాత 200 సార్లు, యుక్త వయసులో 50 సార్లు నవ్వుతాడని.. పెద్దయ్యాక రోజుకు కనీసం మూడు సార్లు నవ్వడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి. దీనిని బట్టి మనిషి నవ్వుకు ఎంతగా దూరమయ్యాడో అర్థమవుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకుని, ఆరోగ్యంగా ఉండటానికి నవ్వండి, నవ్వించండి, నవ్వుతూనే ఉండండి..

సీతంపేట: నవ్వితే హ్యాపీ.. నవ్వకపోతే బీపీ! ఇది నేటి ఆరోగ్య మంత్రం. నవ్వు ఒకప్పుడు నాలుగు విధాల చేటు అనుకునేవారు కానీ, ఆధునిక వైద్యులు నవ్వు నలభై విధాల గ్రేటు అంటున్నారు. నవ్వు కేవలం పెదవులపై పుట్టే భావం కాదు. అది ఒక శక్తివంతమైన ఔషధం. సానుకూల దృక్పథం. నవ్వు ఆరోగ్యానికి మూలం. చిరునవ్వుతో ఏదైనా సాధించవచ్చని పెద్దలు చెప్పే మాట అక్షర సత్యం. నవ్వు ప్రాముఖ్యతను గుర్తుచేయడానికి నగరంలోని విశాఖ హ్యూమర్‌ క్లబ్‌, లాఫ్టర్స్‌ ఫన్‌ క్లబ్‌, ఫ్రెండ్స్‌ కామెడీ క్లబ్‌, క్రియేటివ్‌ కామెడీ క్లబ్‌, హాస్యప్రియ కామెడీ క్లబ్‌లు కృషి చేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూనే కొంత మంది స్నేహితులు క్లబ్‌లుగా ఏర్పడి నెలలో నాలుగు ఆదివారాలు నవ్వులు పూయిస్తున్నారు. ఏటా మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ఆదివారం ‘నవ్వు ఒక భాష’ అనే థీమ్‌తో ద్వారకానగర్‌ పౌర గ్రంథాలయంలో ఫ్రెండ్స్‌ కామెడీ క్లబ్‌ ఆధ్వర్యంలో, అల్లూరి విజ్ఞాన కేంద్రంలో లాఫ్టర్స్‌ ఫన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నాన్‌స్టాప్‌ కామెడీ కార్యక్రమాలు జరగనున్నాయి.

నవ్వు.. ఎందుకంటే..

నవ్వు గురూ..1
1/2

నవ్వు గురూ..

నవ్వు గురూ..2
2/2

నవ్వు గురూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement