
ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్
పాడేరు రూరల్: ఆయుష్మాన్ భారత్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్ తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయుష్మాన్ భారత్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు స్థానిక ఐటీడీఏ ఎదుట రిలే దీక్ష చేపట్టారు. శిబిరాన్ని గురువారం సీటూ నాయకులు సందర్శించి మద్దుతు తెలిపారు. ఈ సందర్భంగా సీటూ నేత చిన్నయ్యపడాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉద్యోగుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం మానుకోవాలన్నారు. ఆయుష్మాన్ భారత్ ఉద్యోగ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమనంగా 23 శాతం వేతన సవరణ జరపాలని, నిర్ధిష్టమైన జాబ్ చాప్టర్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తక్షణమే ప్రభుత్వం, కలెక్టర్ స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు. నాయకుడు బొజ్జన్న తదితరులు పాల్గొన్నారు.
ఆయుష్మాన్ భారత్ వైద్య
ఆరోగ్యశాఖ ఉద్యోగుల రిలే దీక్షలు