రంపచోడవరం: పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానంలో తాటి చెట్లు, వాటి ఉత్పత్తులపై చేపట్టిన పరిశోధనలు సత్ఫాలితాలను ఇవ్వడంతో గిరిజనులకు లబ్ధి చేకూరుతోందని అఖిల భారత తాటి పరిశోధన పథకం కోఆర్డినేటర్ డాక్టర్ అగస్టీన్‌జెరార్ట్ అన్నారు. రంపచోడవరం సమీపంలోని పందిరిమామిడి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వన పరిశోధన స్థానాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హెచ్‌ఆర్‌ఎస్‌లో పరిశోధనల కోసం నాటిన తాటి వనాలను పరిశీలించారు.అనంతరం హెచ్‌ఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త,అధిపతి డాక్టర్ పి.సి.వెంగయ్యతో సమావేశమై తాటి పరిశోధనలపై చర్చించారు. తరువాత ఇసుకపట్ల గ్రామాన్ని సందర్శించి నీరా సేకరణ, తాటి బెల్లం తయారీని పరిశీలించారు. గిరిజన ఉపప్రణాళికలో భాగంగా నీరా సేకరణ బాక్సులు,మొక్కలను గిరిజన యువలకు, మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
అఖిల భారత తాటి పరిశోధన పథకం
కోఆర్డినేటర్ అగస్టీన్