చింతపల్లి: క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు శివప్రసాద్, దినేష్‌కుమార్ అన్నారు. క్షయ వ్యాధిపై నివారణలో భాగంగా శనివారం కోరుకొండలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
డుంబ్రిగుడలో ర్యాలీ
డుంబ్రిగుడ: మండల కేంద్రం డుంబ్రిగుడలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది టీబీ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జాతీయ రహదారి వరకు సాగింది. క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, రెండు వారాలకు మించి దగ్గు ఉంటే ఆస్పత్రిలో వైద్యుడ్ని సంప్రదించాలని ఆయన కోరారు. వైద్యాధికారిణి అంబికరమణి, సిబ్బంది స్వామి, రవింద్ర, సంజీవ్, ప్రభకార్, తదితరులు పాల్గొన్నారు.
అవగాహనతోనే క్షయ నివారణ