ఉత్సవ కమిటీ అధ్యక్షుడు,ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవం పాడేరులోని మోదకొండమ్మతల్లి ఉత్సవాలను భక్తుల సహకారంతో ఈఏడాది అత్యంత ఘనంగా నిర్వహిస్తామని,ఉత్సవ,ఆలయ కమిటీల అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. మే 11,12,13తేదీల్లో నిర్వహించే మోదకొండమ్మతల్లి ఉత్సవాలకు భక్తుల నుంచి చందాలు సేకరించేందుకు ముద్రించిన పుస్తకాలకు శనివారం మోదమ్మ విగ్రహం వద్ద పూజలు చేసిన, అనంతరం ఎమ్మెల్యే విడుదల చేశారు. పలువురు గ్రామపెద్దలు,ఉత్సవ కమిటీ ప్రతినిధులకు ఈపుస్తకాలను పంపిణీ చేశారు.అలాగే ఉత్సవాల నిర్వహణలో భాగస్వామ్యమవుతున్న ఉత్సవ కమిటీ,ఆలయ కమిటీ ప్రతినిధులకు ఐడీ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల విజయవంతానికి అన్ని వర్గాల భక్తులు ఉత్సవ కమిటీకి సహకరించాలని కోరారు.ఉత్సవాలకు భక్తులంతా పెద్ద మొత్తంలో చందాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూరెడ్డి రామునాయుడు,ఆలయ కమిటీ,ఉత్సవ కమిటీ ప్రతినిధులు పలాసి కృష్ణారావు,కిల్లు కోటిబాబునాయుడు, కొణతాల ప్రశాంత్,సల్లా రామకృష్ణ,బోనంగి వెంకటరమణ, కొణతాల సతీష్, చిన్ని, కేజియారాణి, స్వరూప, కూడా కుమారి,మర్ల మణి, లక్ష్మి, కూడా సుబ్రహ్మణ్యం, కొంటా దుర్గారావు, కిల్లు రాధాకృష్ణ, బొజ్జా త్రినాధ్, నాయుడు, అబ్బాస్, నవీన్, కాళ్ల కిరణ్, కిల్లు చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.