ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
డుంబ్రిగుడ: ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండలంలోని కించుమండ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను ఆయన శనివారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి బోధనపై ఆరా తీశారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెనూ అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కించుమండ పాఠశాల కాంప్లెక్స్ పరిధి ప్రాథ మిక పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్న విషయం తనదృష్టికి వచ్చిందని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గౌలి, వసబంద గ్రామాల నుంచి వచ్చి కించుమండల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నామని, ఆయా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యా ర్థులు ఎమ్మెల్యేకు తెలపడంతో వెంటనే ట్రైబల్ వెల్ఫేర్ జేఈతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ రోడ్డు మంజూరైందని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్టు తెలిపా రు. ఆశ్రమ పాఠశాలలో రోజు కూలీగా పనిచేస్తున్న చంద్రమ్మకు రెండు నెలల జీతాలు త్వరగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఏటీడబ్ల్యూవో మల్లికార్జునరావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం ఎం.గెన్ను, రాంబాబు, శెట్టి సూరిబాబు, కిల్లో అప్పలరాజు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.