పెదబయలు: మండలంలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు బుధవారం నుంచి రవాణా సదుపాయం కల్పించారు. ‘కాలి నడకన పరీక్ష కేంద్రాలకు’అనే శీర్షికన ఈ నెల 18న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా విద్యాశాఖాధికారులు స్పందించారు. బుధవారం హిందీ పరీక్షకు సంబంధించి ఏపీ గురుకుల పాఠశాల, తురకలవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు ఆటోల్లో తరలించారు. ఇలా ప్రతి రోజు వాహనాల్లో విద్యార్థులను కేంద్రాలకు తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శంకరరావు, తురకలవలస హెచ్‌ఎం గంగాబాయ్ మాట్లాడుతూ పరీక్షలు జరిగేంత వరకు విద్యార్థులను ఆటోల్లో తరలిస్తామన్నారు.
‘పది’ విద్యార్థులకు రవాణా సదుపాయం
‘పది’ విద్యార్థులకు రవాణా సదుపాయం
‘పది’ విద్యార్థులకు రవాణా సదుపాయం
‘పది’ విద్యార్థులకు రవాణా సదుపాయం