గంగవరం: మాస్‌కాపీయింగ్‌కు తావులేకుండా టెన్త్ పరీక్షలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశించారు. గంగవరంలోని రెండు పరీక్ష కేంద్రాలను బుధవారం పీవో ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలను ప్రత్యేకాఽఽధికారులు ఎంపీడీవో లక్ష్మణరావు, సీడీపీవో లక్ష్మి పరిశీలించారు.