చింతపల్లి: మండలంలోని డైరీనగర్‌లో సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని సీఆర్‌పీఎఫ్ 234 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ తెలిపారు.జిల్లా సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ మనోజ్‌కుమార్ ఆదేశాల మేరకు చింతపల్లి మేజర్ పంచాయతీ పరిధిలో గల డైరీనగర్ గ్రామాన్ని ఆమె దత్తత తీసుకున్నారు. బుధవారం ఎంపీపీ కోరాబు అనూషదేవి,సర్పంచ్ దురియా పుష్పలతో కలిసి గ్రామాన్ని తొలి సారిగా సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ యువతకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తమ బృందం ప్రణాళిక రూపొందిస్తోందని చెప్పారు. ఉపాధి కోసం గ్రామాన్ని వదిలి వెళ్లినవారు, వ్యవసాయం చేస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నామన్నారు.ఎవరికి ఏ విధంగా ఉపాధి కల్పించాలనే దానిపై ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు.యువతకు నచ్చిన వృత్తిలో నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.చెడు వ్యసనాలకు దూరంగా ఉన్న గ్రామం కావడంతోనే ప్రత్యేకించి ఈ డైరీనగర్ దత్తత తీసుకున్నట్టు ఆమె తెలిపారు.ఏ కార్యక్రమమైన స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి చేపడతామన్నారు. ఈ ప్రాంత గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు యేసుపాదం వితరణగా ఇచ్చిన రగ్గులను పంపిణీ చేశారు.అనంతరం గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు నాజర్‌వల్లి, వైఎస్సార్‌సీపీ నాయకులు సింహాచలం,కరుణా నిధి,హేమంత్,శ్రీనివాసు,మధు పాల్గొన్నారు.
గ్రామాన్ని దత్తత తీసుకున్న సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వినీత
ఎంపీపీ, సర్పంచ్‌తో కలిసి
గ్రామ సందర్శన