గోడు పట్టదు..
ఉద్యోగం కోసంతిరుగుతున్నా..
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న ఆఫీసు సబార్డినేట్ పోస్టు ఇప్పించాలని దరఖాస్తు చేశాను. గతంలో ఓసారి గ్రీవెన్స్ సెల్‌లో అర్జీ ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడంతో మరోమారు దరఖాస్తు చేయాల్సివచ్చింది. ఈ సారైనా సమస్య పరిషారమవుతుందో లేదో చూడాలి
– కారం సీతారామయ్య, గుర్రంపేట, వీఆర్‌పురం మండలం
చట్టిని ప్రాధాన్యతాక్రమంలో చేర్చాలి
చట్టి గ్రామం వరదముంపునకు గురవుతోంది. వరదల సమయంలో ఇళ్లను వదిలి కొండలపై నివాసముంటున్నాం. మాగ్రామాన్ని పోలవరం ముంపు జాబితాలో చేర్చి పరిహారం అందించాలి. దీనిపై పలుమార్లు విజ్ఞప్తి చేశాను.
– తుర్రం చినముత్తయ్య,
చట్టి, చింతూరు మండలం
భూమికి పరిహారం ఇవ్వాలి
వీఆర్‌పురం మండలం చొ ప్పల్లిలో ఉన్న 5.67 ఎకరా లభూమి పోలవరం ముంపునకు గురవుతోంది. నా భూమి పరిహారం జాబితాలో లేదని అధికా రులు చెబుతున్నారు. దీంతో పరిహారం రాదనే ఆందోళన నెలకొంది. నా భూమిని జాబితాలో చేర్చి పరిహారమివ్వాలి. దీనిపైఅర్జీ అందజేశాను.
– సార్లంక రమణమ్మ, రామవరం, వీఆర్‌పురం మండలం
చింతూరు: తమ సమస్యల పరిష్కారం కోసం గంపెడాశతో అధికారుల వద్దకు వస్తున్న ప్రజలకు ఎదురుచూపులు తప్పడంలేదు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి సమస్యలు పరిష్కారించాల్సిన అధికారులు వాటిపై శ్రద్ధచూపడం లేదని ప్రజలు వాపోతున్నారు. చింతూరులో ప్రతి బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుంది. డివిజన్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో వ్యయప్రయాసలతో ఇక్కడకు వచ్చి ఐటీడీఏ పీవోకు తమ సమస్యలు విన్నవించుకుంటారు. వాటిని పరిశీలించిన పీవో సంబంధిత శాఖల అధికారులకు వాటిని అందించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశిస్తారు. అయితే ఆ సమస్యల్లో అత్యధికం పరిష్కారానికి నోచుకోవడం లేదు
పోలవరం సమస్యలే అధికం
చింతూరులో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రధానంగా పోలవరం నిర్వాసితులకు సంబంధించిన సమస్యలే అధికంగా వస్తున్నాయి. స్థానిక అధికారులతో పాటు పోలవరం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో చివరకు పీవోకు మొరపెట్టుకుంటున్నారు. గ్రామాలు ముంపునకు గురవుతున్నా పొలాలు ముంపులో లేవంటూ పరిహారం ఇవ్వడంలేదని కొందరు, పొలాలు ముంపునకు గురవుతున్నా గ్రామాలు మునగడం లేదంటూ పరిహారం నిరాకరిస్తున్నారని మరికొందరు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. గృహాల పరిహారంలో తమ పేర్లు నమోదు చేయలేదని, తమ ఇళ్లకు తక్కువగా విలువు కట్టారని, కుటుంబ ప్యాకేజీలో తమపేర్లు గల్లంతయ్యాయనే కారణాలతో వందలాది దరఖాస్తులు వస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న తమ పేర్లను సరిచేసుకునేందుకు సచివాలయంలో సంబంధిత డాక్యుమెంట్లు సమర్పిస్తున్నా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అవి సరిగా అప్‌లోడ్ కాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ నిర్వాసితులు వాపోతున్నారు. తమపేర్లు పూర్తిస్థాయిలో సక్రమంగా లేకుంటే పరిహారం రాదేమోనని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు తరచూ వరద ముంపునకు గురవుతున్న తమ గ్రామాలను ప్రాధాన్యతా క్రమంలో చేర్చి పరిహారం అందించాలంటూ పలు గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. ఈ బుధవారం ఐటీడీఏలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 58 అర్జీలు రాగా వాటిలో పోలవరానికి సంబంధించి 18 దరఖాస్తులు, ఎటపాక మండలం బూరుగువాయి, రామగోపాలపురం రహదారి నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోతున్న తమకు పరిహారం అందించాలంటూ 10 దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈనెల 12 వరకు మొత్తం 312 అర్జీలు రాగా వాటిలో 189 పరిష్కారమయ్యాయి.
గోస తీరదు
గోస తీరదు
గోస తీరదు
గోస తీరదు
గోస తీరదు
గోస తీరదు
గోస తీరదు