చింతపల్లి: మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు బకాయిపడిన గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యధర్శి బోనంగి చిన్నయ్యపడాల్ డిమాండ్ చేశారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మంగళవారం ఆందోళన చేశారు. చింతపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గడిచిన నవంబర్ నుంచి భోజన కార్మికులకు వేతనాలను చెల్లించక పోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.వారికి బకార ుు పడిన వేతనాలు వెంటనే చెల్లించకుంటే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి చిరంజీవి,కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు పసుపులేటి లక్ష్మి,కార్యదర్శి కేసుబాబు,జ్యోతి,వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.